ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత కనిపించని క్రిష్..!

టాలెంటెడ్ డైరక్టర్ క్రిష్ ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత కనిపించకుండా పోయాడు. మొన్నామధ్య పవన్ కోసం కథ సిద్ధం చేసినట్టు వార్తలు వచ్చినా పవన్ ప్రస్తుతం క్రిష్ తో చేసే అవకాశం లేదని చెప్పడంతో సైలెంట్ అయ్యాడట. ఇక చేసేదేం లేక వెబ్ సీరీస్ తీయాలని ఫిక్స్ అయ్యాడు క్రిష్. అయితే వెబ్ సీరీస్ డైరెక్ట్ చేయడం కన్నా నిర్మించాలని అనుకుంటున్నాడు క్రిష్. దడ ఫేం అజయ్ భూయాన్ వెబ్ సీరీస్ ను డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది.

నవదీప్, బిందు మాధవి, హెబ్భా పటేల్, తేజశ్వి మడివాడా వంటి స్టార్స్ తో క్రిష్ ఈ వెబ్ సీరీస్ ను చేస్తాడని తెలుస్తుంది. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత క్రిష్ ఆలోచనలో మార్పు వచ్చిందని తెలుస్తుంది. ఓ పక్క సలెంట్ గా వెళ్లి బాలీవుడ్ లో సినిమా తీయాలని అనుకున్నా మణికర్ణిక విషయంలో కంగనా రనౌత్ తో గొడవ అక్కడకు వేళ్లకుండా చేస్తుంది. మరి క్రిష్ తన తర్వాత సినిమా ఏం చేస్తాడో చూడాలి.