నితిన్ ప్రేమలో పడ్డాడా..?

లవర్ బోయ్ నితిన్ ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో ఉన్నాడని తెలిసిందే. వరుస సినిమాలతో బిజీగా ఉన్న నితిన్ ప్రేమలో పడినట్టు తెలుస్తుంది. అవును నితిన్ ప్రేమలో ఉన్నాడట ప్రేమించిన ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడని తెలుస్తుంది. కొన్నాళ్లుగా నితిన్ ఒక అమ్మాయితో ప్రేమలో ఉన్నాడట వచ్చే ఏడాది మొదట్లోనే ఆమెతో పెళ్లి జరుగుతుందని తెలుస్తుంది. 

ఇక సినిమాల విషయానికి వస్తే నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల డైరక్షన్ లో భీష్మ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో నితిన్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా వెంకీ అట్లూరి డైరక్షన్ లో రంగ్ దే సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది ఒక్క సినిమా కూడా రిలీజ్ చేయని నితిన్ 2020లో మాత్రం మూడు సినిమాలు రిలీజ్ చేసేలా ప్లాన్ చేశాడు.