
ప్రముఖ నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు (80) చెన్నైలోని హాస్పిటల్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మారుతీరావు ట్రీట్ మెంట్ కు బాడీ సహకరించకపోవడం వల్ల ఈరోజు అనంతలోకాలకు వెళ్లిపోయారు. 250కి పైగా సినిమాల్లో నటించిన ఆయన ఎన్నో నాటకాలు, కథలు, నవలలు రాశారు.
1939 ఏప్రిల్ 14న విజయనగరంలో గొల్లపూడి మారుతీరావు జన్మించారు. రైటర్ గా కొనసాగిస్తూ చిరంజీవి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో సిని రంగ ప్రవేశం చేశారు. ఎలాంటి పాత్ర ఇచ్చినా సరే తన మార్క్ చూపించే మారుతీరావు నటకు చాలామంది అభిమానులు ఉన్నారు. రీసెంట్ గా ఆది సాయికుమార్ నటించిన జోడీ సినిమాలో చివరగా నటించారు గొల్లపూడి మారుతీరావు. ఆయన మరణ వార్త విని సిని పరిశ్రమ షాక్ అయ్యింది.