రాజమౌళి ఎవరెవరినో పెడుతున్నాడు.. నన్ను పెట్టాల్సింది..!

దృశ్యం సినిమాతో సౌత్ ఆడియెన్స్ ను అలరించిన జీతు జోసెఫ్ చేసిన సినిమా దొంగ. కోలీవుడ్ లో ఈ మూవీని తంబీగా రిలీజ్ చేస్తున్నారు. రీసెట్ గా ఖైది సినిమాతో సూపర్ హిట్ అందుకున్న కార్తి దొంగగా రాబోతున్నాడు. ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ ఈరోజు రిలీజైంది. సినిమా ట్రైలర్ ఇంప్రెసివ్ గా ఉంది. 15 ఏళ్ల క్రితం తప్పిపోయిన తమ్ముడు ఇంటికి వస్తే ఆ తల్లిదండ్రులు, అక్క ఎలా రిసీవ్ చేసుకున్నారు. ఇంతకీ వచ్చింది నిజమైన వ్యక్తా కాదా అన్నది సినిమాలో చూడాలి.   

ఇక ట్రైలర్ లో కార్తి న్యాయంగా రాజమౌళి నన్ను తీసుకోవాలి కాని ఎవరెవరినో పెడుతున్నాడు అంటూ చెబుతాడు. కార్తి ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్.. జ్యోతిక అద్భుత నటన సినిమాకు ప్లస్ అవనున్నాయి. ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచగా కార్తి మరో హిట్ తన ఖాతాలో వేసుకునేలా ఉన్నాడు. దొంగగా కార్తి ప్రేక్షకులను ఏ రేంజ్ లో మెప్పిస్తాడో చూడాలి.