గీతా ఆర్ట్స్ లో రామ్ మూవీ..!

టాక్సీవాలా సినిమాతో సూపర్ హిట్ అందుకున్న డైరక్టర్ రాహుల్ సంకృత్యన్ తన సెకండ్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు. టాక్సీవాలా లానే తన సెకండ్ సినిమాను కూడా గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిసి నిర్మిస్తారని తెలుస్తుంది. అయితే యువ హీరోలంతా ప్రస్తుతం వారి వారి ప్రాజెక్టులతో బిజీగా ఉండటం వల్ల ఫైనల్ గా ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నట్టు తెలుస్తుంది.

ఇస్మార్ట్ శంకర్ హిట్ తో మంచి జోష్ లో ఉన్న రామ్ ప్రస్తుతం కిశోర్ తిరుమల డైరక్షన్ లో రెడ్ సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ తర్వాత రాహుల్ డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. ఈ మూవీ టైం మిషన్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని అంటున్నారు. గీతా ఆర్ట్స్, యువి క్రియేషన్స్ కలిసి ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారట. మరి ఇస్మార్ట్ జోష్ లో ఉన్న రామ్ క్రేజీ ప్రాజెక్టులను చేస్తున్నాడు.