
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ అల వైకుంఠపురములో. హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సం యుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. సినిమాలో అల్లు అర్జున్ సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. థమన్న్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి రిలీజైన 3 సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి.
ఇక ఈ సినిమాకు సంబందించిన టీజర్ కొద్ది నిమిషాల క్రితం రిలీజైంది. త్రివిక్రం టీజర్ అంటే ఇలానే ఉంటుందనిపించేలా ఇది ఉంది అది లేదు అనే డౌట్ లేకుండా అన్ని కవర్ చేశాడు. ముఖ్యంగా త్రివిక్రం పెన్ పవర్ ఏంటో మరోసారి చూపించబోతున్నాడని తెలుస్తుంది. లాస్ట్ పంచ్ అదే మీరిప్పుడే కారు దిగారు.. నేనిప్పుడే క్యారక్టర్ ఎక్కా అంటూ బన్ని చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. సినిమా టీజర్ ఇంప్రెస్ చేయగా కచ్చితంగా సినిమా బన్ని కెరియర్ లో మరో హిట్ కొట్టేలా ఉంది.