RRR ఎన్.టి.ఆర్ లుక్ లీక్.. వీడియో వైరల్..!

బాహుబలి తర్వాత రాజమౌళి చేస్తున్న క్రేజీ మూవీ ఆర్.ఆర్.ఆర్. సినిమాలో యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్, మెగా పవర్ స్టార్ రాం చరణ్ నటిస్తున్నారు. సినిమాలో అల్లూరిగా చరణ్, కొమరం భీం గా తారక్ కనిపించనున్నారు. ఇక ఈ సినిమాలో అలియా భట్, ఒలివియా మోరిస్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. 2020 జూలై 30న ఈ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా నుండి ఎన్.టి.ఆర్ కొమరం భీం లుక్ లీక్ అయ్యింది.

కొమరం భీం పాత్రలో తారక్ లుక్ అదిరిపోయింది. జన సమూహంలో ప్రజలను ఉద్దేశించి ఏదో మాట్లాడుతున్నట్టుగా స్టిల్ ఉంది. అయితే దీనికి సంబందించిన వీడియో కూడా లీక్ అవగా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే వెంటనే సైబర్ క్రైం టీం వీడియో లింక్స్ అన్నిటిని క్లోజ్ చేసింది. ఆర్.ఆర్.ఆర్ లీక్ పై రాజమౌళి చాలా సీరియస్ గా ఉన్నాడని తెలుస్తుంది.