ఆ హీరోయిన్ పై తమన్ స్పెషల్ ఇంట్రెస్ట్..!

ఈమధ్య మంచి ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరక్టర్ ఎస్.ఎస్.థమన్ వరుస హిట్లు కొడుతున్నాడు. అంతేకాదు దేవి శ్రీ ప్రసాద్ ను వెనక్కి నెట్టి స్టార్స్ అన్ని సినిమాలను చేస్తున్నాడు. డిసెంబర్ 13న వెంకీమామ, 20న ప్రతిరోజు పండుగే, డిస్కో రాజా ఆ తర్వాత సంక్రాంతికి అల వైకుంఠపురములో ఇలా ప్రతి వారం వచ్చే సినిమాల్లో తమన్ సినిమా తప్పకుండా ఉంటుంది. అలాంటి థమన్ ఓ హీరోయిన్ కోసం స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు తెలుస్తుంది.

ఆరెక్స్ 100 సినిమాతో యువత మనసులు గెలిచిన పాయల్ రాజ్ పుత్ ను తను చేసే సినిమాలకు రిఫర్ చేస్తున్నాడట థమన్. ఆరెక్స్ 100 తర్వాత ఆర్.డి.ఎక్స్ లవ్ అంటూ ఓ చెత్త సినిమా చేసిన పాయల్ సరైన ఛాన్స్ కోసం ఎదురుచూస్తుంది. ప్రస్తుతం వెంకీమామ, డిస్కో రాజా సినిమాల్లో నటించింది. ఆ సినిమాల్లో కూడా థమన్ ఛాన్స్ ఇప్పించాడని అంటున్నారు. మరి ఈ భామ మీద థమన్ కు అంత స్పెషల్ ఇంట్రెస్ట్ దేనికో అని ఇండస్ట్రీ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.