
సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమా తర్వాత మహేష్ రాజమౌళితో సినిమా చేస్తాడని వార్తలు వస్తున్నాయి. ఇక డైరక్టర్ అనీల్ రావిపుడి కూడా తన నెక్స్ట్ సినిమా హీరోని కన్ఫాం చేసినట్టు తెలుస్తుంది. అతనెవరో కాదు అంతకుముందు తన డైరక్షన్ లో సినిమా ఓకే చేసి చివరి నిమిషంలో చేతులెత్తేసిన హీరోతోనే నెక్స్ట్ సినిమా చేస్తున్నాడు.
అనీల్ సినిమా మిస్ చేసుకున్న ఆ హీరో ఎవరంటే రామ్ పోతినేని. మాస్ మహరాజ్ రవితేజతో అనీల్ రావిపుడి తీసిన రాజా ది గ్రేట్ సినిమాను ముందు రామ్ తోనే తీద్దామని అనుకున్నారు. సెట్స్ మీదకు వెళ్లే టైంలో రామ్ ఎందుకో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకున్నాడు. అయితే రామ్ ప్లేస్ లో రవితేజ వచ్చి సినిమా చేసి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు వరుస హిట్లతో మంచి ఫాంలో ఉన్నాడని రామ్ కోరి మరి అనీల్ రావిపుడితో సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం రామ్ కిశోర్ తిరుమల డైరక్షన్ లో రెడ్ సినిమా చేస్తున్నాడు. అది పూర్తయిన తర్వాత ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.