ఉదయ్ కిరణ్ బయోపిక్.. యువ హీరో కంగారుపడ్డాడు..!

లవర్ బోయ్ ఇమేజ్ వచ్చినా సరే కెరియర్ లో కొన్ని తప్పటడుగుల వల్ల తన ప్రాణాలు సైతం కోల్పోయాడు ఉదయ్ కిరణ్. అతని బయోపిక్ సినిమా చేయాలని అప్పట్లో తేజ ప్రయత్నించాడు కాని వర్క్ అవుట్ కాలేదు. అయితే లేటెస్ట్ గా సందీప్ కిషన్ హీరోగా నిర్మాతగా ఉదయ్ కిరణ్ బయోపిక్ చేస్తాడని వార్తలు వచ్చాయి. హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న సందీప్ కిషన్ ఇలాంటి సినిమా చేస్తాడా అని అందరు షాక్ అయ్యారు.

అయితే ఇక్కడ అసలు విషయం ఏంటంటే సందీప్ కిషన్ తో ఉదయ్ కిరణ్ సినిమా అన్న వార్తలన్ని అవాస్తవమని తెలుస్తుంది. రీసెంట్ గా తాను ఉదయ్ కిరణ్ బయోపిక్ లో నటిస్తానని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తేల్చి చెప్పాడు సందీప్ కిషన్. తనని ఆ బయోపిక్ తీద్దామని ఎవరు సంప్రదించలేదని. ప్రస్తుతం తనకు బయోపిక్ సినిమాలు చేసే ఆలోచన లేదని అన్నాడు సందీప్ కిషన్. ఉదయ్ కిరణ్ బయోపిక్ అనగానే అందులో మెగా ఫ్యామిలీ ప్రస్థావన కూడా ఉంటుందని హీరోలు అతని బయోపిక్ లో నటించడానికి వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తుంది.