
రైటర్ గా సక్సెస్ ఫుల్ సినిమాలు తీసిన వక్కంతం వంశీ డైరక్టర్ చేసిన మొదటి సినిమా నాపేరు సూర్య. అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆ సినిమా ఆడియెన్స్ ను అలరించడంలో విఫలమైంది. ఆ సినిమా తర్వాత వంశీకి ఛాన్సులు రాలేదు. అయితే మళ్లీ మెగా కాంపౌండ్ నుండే అతనికి అవకాశం వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తుందని తెలుస్తుంది.
మెగా హీరోల్లో ఒకరు వక్కంతం వంశీ సినిమాలో హీరోగా నటిస్తారని తెలుస్తుంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వచ్చిన నా పేరు సూర్య కంటెంట్ బాగున్నా సరే ఎందుకో వర్క్ అవుట్ కాలేదు. అందుకే ఈసారి పకడ్బందీ స్క్రిప్ట్ తో సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు వక్కంతం వంశీ. మరి వంశీ డైరక్షన్ లో ఎవరు హీరోగా చేస్తారో చూడాలి.