
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీగా వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తుంది. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని సాంగ్స్ ఇప్పటికే సెన్సేషనల్ హిట్ అయ్యాయి. 2020 సంక్రాంతికి రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా నుండి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది.
సినిమాలో అల్లు అర్జున్ డ్యుయల్ రోల్ లో నటిస్తాడని తెలుస్తుంది. సినిమా పోస్టర్స్ లో కొన్ని లుక్స్ పల్లెటూరి వ్యక్తిగా కనిపిస్తుండగా.. మరో కొన్ని లుక్స్ స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. సినిమాలో బన్ని ద్విపాత్రాభినయం చేస్తున్నాడని లేటెస్ట్ టాక్. మూవీలో సుశాంత్, నివేదా పేతురాజ్, నవదీప్, టబు వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు.