సమంత మరో కొత్త ప్రయత్నం

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న సమంత అక్కినేని కోడలిగా మారిన తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తుంది. ఈ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలతో సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం తమిళ సూపర్ హిట్ మూవీ 96 రీమేక్ లో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా అమేజాన్ ప్రైమ్ వెబ్ సీరీస్ ఫ్యామిలీ మ్యాన్ 2లో కూడా సమంత నటిస్తుందని తెలుస్తుంది.   

కథల విషయంలో మంచి ఆలోచన ఉన్న సమంత ఇక మీదట నిర్మాతగా కూడా మారబోతున్నారని తెలుస్తుంది. చిలసౌ సినిమా తను కథ విని.. సినిమాను అన్నపూర్ణ బ్యానర్ లో రిలీజ్ అయ్యేలా చేసింది. ఇప్పుడు సమంత పూర్తిస్థాయి నిర్మాతగా మారాలని చూస్తుంది. సమంత ఓన్ ప్రొడక్షన్ లో తనే హీరోయిన్ గా చేస్తుందా లేక ప్రతిభ గల వారిని ప్రోత్సహిస్తుందా అన్నది చూడాలి. మరి హీరోయిన్ గా సక్సెస్ అయిన సమంత నిర్మాతగా ఎలాంటి క్రేజ్ తెచ్చుకుంటుందో చూడాలి.