
ఇదేంటి పొలిటికల్ హెడ్ లైన్ స్టోరీ సినిమా న్యూస్ లో వచ్చిందని అనుకోవచ్చు. బాలకృష్ణ, రోజా ఇప్పుడు నాయకులు కాని ఒకప్పుడు ఇద్దరు సినిమా వాళ్లే.. ఒకప్పుడు ఏంటి ఇప్పుడు కూడా వారు సినిమా వాళ్లే.. ఇద్దరు చెరో పార్టీలో ఉండి పొలిటికల్ ఫైట్ చేసుకుంటూనే ఉంటారు. అయితే ఇప్పుడు ఆ ఫైట్ తెర మీదకు కూడా తీసుకురాబోతున్నారు. అదేంటి అంటే ప్రస్తుతం కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో రూలర్ సినిమా చేస్తున్న బాలయ్య తర్వాత బోయపాటి మూవీ ఫిక్స్ చేసుకున్నాడు.
సింహా, లెజెండ్ తర్వాత బాలకృష్ణ, బోయపాటి కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ యాక్షన్ హీరో సంజయ్ దత్ ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు సినిమాలో ఓ పవర్ ఫుల్ లేడీ విలన్ పాత్ర రాసుకున్నాడట బోయపాటి శ్రీను. ఆ పాత్రకు నగరి ఎమ్మెల్యే రోజాని తీసుకునే ఛాన్స్ ఉందట. సరైన పాత్ర వస్తే సినిమాల్లో రాణించాలని చూస్తున్న రోజా ఇప్పటికే బుల్లితెర మీద సందడి చేస్తుంది. ఇక ఇదివరకు బాలకృష్ణ, రోజా కలిసి జతకట్టిన సినిమాలు హిట్ అందుకున్నాయి.