అర్జున్ సురవరంకు మెగాస్టార్ ముద్ర..!

పరిశ్రమలో ఏ చిన్న సినిమా రిలీజ్ అవుతున్నా సరే పరిశ్రమ పెద్ద దిక్కుగా మెగాస్టార్ చిరంజీవి తన బాధ్యతగా వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. దాసరి తర్వాత ఆ బాధ్యత మీద వేసుకున్న చిరంజీవి ఈమధ్య ప్రతి సినిమాకు తన సపోర్ట్ ఇస్తున్నారు. లేటెస్ట్ గా నిఖిల్ హీరోగా టి.ఎన్ సంతోష్ డైరక్షన్ లో తెరకెక్కిన సినిమా అర్జున్ సురవరం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా వచ్చారు.

చిరు వస్తున్నాడని తెలుసుకున్న మెగా ఫ్యాన్స్ చాలామంది ఈ ఈవెంట్ కు వచ్చారు. ఠాగూర్ మధు సమర్పణలో.. రాజ్ కుమార్ నిర్మించిన ఈ సినిమా తాను ఆల్రెడీ చూశానని ప్రస్తుతం డిజిటల్ కాలంలో ఉన్న నేటి యువత తన పర్సనల్ డేటా యాప్స్ రూపంలో అందరికి ఇచ్చేస్తున్నారని.. ఈ సినిమా అలాంటి వారికి జాగ్రత్త వహించేలా చెప్పే కథ అని అన్నారు. అర్జున్ సురవరం తాను చూశానని తప్పకుండా ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని అన్నారు చిరంజీవి.   

నిఖిల్ రెండు మూడు సినిమాలు తాను చూశానని సినిమాలో తను చాలా బాగా చేశాడని అన్నారు. ఈరోజు నుండి నాకు మరొ తమ్ముడు దొరికాడని అన్నారు చిరంజీవి. ఇదే వేదికపై నిఖిల్ చిరు గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడాడు. తన సినిమాకు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా రావడం నమ్మలేకపోతున్నానని అన్నారు. మరో అతిథిగా వచ్చిన శ్రీనివాస్ యాదవ్ కు తన కృతజ్ఞతలు తెలిపాడు నిఖిల్.