
అక్కినేని నాగ చైతన్య బర్త్ డే సందర్భంగా అతను బాగుండాలని కోరుతూ ఓ క్రేజీ అక్కినేని ఫ్యాన్ సిం హాచలం కొండ మీదకు మెట్ల దారి గుండా మోకాళ్లతో కొండ ఎక్కాడు. 1000 మెట్ల దాకా ఉండే ఈ మెట్లను మోకాళ్లతో ఎక్కి చైతు బాగుండాలని కోరుకున్నాడు అక్కినేని కుటుంబ అభిమాని సాగర్. అయితే అక్కినేని ఫ్యాన్స్ అసోషియేషన్ ద్వారా ఈ వీడియో బాగా వైరల్ అయ్యింది.
తన భర్త చైతు గురించి ఇలా ఓ అభిమాని చేయడం గురించి తెలుసుకున్న సమంత ఇది నమ్మశక్యంగా లేదని.. ఏం మాట్లాడాలో తెలియడం లేదని.. దయచేసి మీరు మమ్మల్ని కలవండి అంటూ ట్వీట్ చేశారు. అంత కష్టపడి సాగర్ చేసిన ఈ పనికి తగిన ప్రతిఫలం దక్కిందని చెప్పాలి. ప్రస్తుతం నాగ చైతన్య వెంకీమామ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఈ సినిమాతో పాటుగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో మరో సినిమా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు నాగ చైతన్య.