
సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబోలో వస్తున్న క్రేజీ మూవీ సరిలేరు నీకెవ్వరు. దిల్ రాజు, అనీల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. రీసెంట్ గా సినిమా నుండి రిలీజైన టీజర్ అంచనాలు పెంచేసింది. అయితే టీజర్ చూసిన రష్మిక ఫ్యాన్స్ మాత్రం నిరుత్సాహపడ్డారు.
మహేష్ టీజర్ వ్యూయర్ కౌంట్ లో సెన్సేషన్స్ క్రియేట్ చేస్తుంది. అయితే టీజర్ లో రష్మిక లేకపోవడం కాస్త డిజపాయింట్ చేసింది. చేసిన నాలుగు సినిమాలతోనే తెలుగులో సూపర్ ఫాలోయింగ్ ఏర్పరచుకున్న రష్మిక మహేష్ బాబుతో ఛాన్స్ అందుకుని స్టార్ హీరోయిన్ అయ్యింది. అయితే రష్మిక ఫ్యాన్స్ కోసం త్వరలోనే సరిలేరు టీం స్పెషల్ టీజర్ వదులుతుందట. 2020 జనవరి 11న మహేష్ సరిలేరు నీకెవ్వరు మూవీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.