ఎయిటీస్ తారలు సందడే సందడి..!

1980లో హీరోలుగా ఎంట్రీ ఇచ్చి స్టార్స్ గా ఎదిగిన తెలుగు, తమిళ, హింది, కన్నడ, మళయాళ భాషల హీరోలందరు ఏడాదికి ఒకసారి క్లాస్ ఆఫ్ ఎయిటీస్ అనే పార్టీ చేస్తుంటారు. ఒక్కో సంవత్సరం ఒక్కొక్కరు దాన్ని హోస్ట్ చేస్తుంటారు. ఈ ఇయర్ లో మెగాస్టార్ చిరంజీవి హోస్ట్ గా 80వ దశకంలోని హీరోలు, హీరోయిన్స్ అందరికి పెద్ద పార్టీ ఇచ్చారు. చిరు ఇంట్లోనే ఈ ఈవెంట్ జరగడం విశేషం.  

చిరుతో పాటుగా తెలుగు హీరోలు వెంకటేష్, నాగార్జున, నరేష్, సురేష్, సుమన్ పాల్గొన్నారు. తమిళ పరిశ్రమ నుండి ప్రభు, శరత్ కుమార్ కూడా ఈ ఈవెంట్ కు అటెండ్ అయ్యారు. ఇక అప్పటి హీరోయిన్స్ అందరు కూడా ఈ పార్టీలో అటెండ్ అయినట్టు తెలుస్తుంది. ఒకే కలర్ కాస్టూం తో వీళ్లంతా ఓ డ్రెస్ కోడ్ కూడా మెయింటైన్ చేయడం చూస్తే అప్పటికి ఇప్పటికి వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవని అనిపిస్తుంది. ఈ పార్టీకి నందమూరి బాలకృష్ణ మిస్ అయ్యారు.