96 రీమేక్.. రిలీజ్ ఎప్పుడంటే..!

తమిళంలో విజయ్ సేతుపతి, త్రిష జంటగా నటించి సూపర్ హిట్ అందుకున్న సినిమా 96. ప్రేమ్ కుమార్ డైరక్షన్ లో వచ్చిన ఆ సినిమా తమిళ తంబీలను విశేషంగా ఆకట్టుకుంది. వసంత్ కుమార్ మ్యూజిక్ సినిమాకు మరో హైలెట్ గా నిలిచింది. ఆ సినిమా రిలీజ్ కు ముందే సినిమా రీమేక్ రైట్స్ కొనేశారు దిల్ రాజు. ఇక రిలీజ్ తర్వాత అక్కడ హిట్ అవడంతో తెలుగులో కూడా ఆ సినిమా రీమేక్ చేస్తున్నారు.  

దిల్ రాజు నిర్మాణంలో మాత్రుక దర్శకుడు ప్రేం కుమార్ ఈ సినిమాను తెలుగులో కూడా డైరెక్ట్ చేస్తున్నారు. శర్వానంద్, సమంతలు జంటగా నటిస్తున్న ఈ సినిమా అసలైతే ఈ ఇయర్ ఎండింగ్ కల్లా రిలీజ్ అన్నారు. కాని ఈ సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ ఫిక్స్ చేశారు. ఫిబ్రవర్ 14 విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ రిలీజ్ ఫిక్స్ చేశారు. అందుకే ఆ సినిమాకు వారం ముందు 96 తెలుగు రీమేక్ వస్తుంది. మరి ఈ సినిమా తమిళంలో హిట్టైనట్టుగా తెలుగులో ఆ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో లేదో చూడాలి.