
యువ హీరో లవర్ బోయ్ ఇమేజ్ సంపాదించిన ఉదయ్ కిరణ్ సినిమాల్లో ఛాన్సులు రాక డిప్రెషన్ వల్ల సూసైడ్ చేసుకుని మరణించిన విషయం తెలిసిందే. ఆయన జీవిత కథతో తేజ ఓ సినిమా చేస్తాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. కాని ఆయన ఎందుకో వెనక్కి తగ్గాడు. లేటెస్ట్ గా ఉదయ్ కిరణ్ బయోపిక్ తీసేందుకు రెడీ అవుతున్నాడట యువ హీరో సందీప్ కిషన్. రీసెంట్ గా ఓ నూతన దర్శకుడు ఉదయ్ కిరణ్ బయోపిక్ స్టోరీని నరేట్ చేశాడట.
అతను చెప్పిన విధానానికి ఇంప్రెస్ అయిన సందీప్ కిషన్ తన ప్రొడక్షన్ లోనే ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడత. ఉదయ్ కిరణ్ సినిమాల్లో ఎంట్రీ.. అతని క్రేజ్.. మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతుతుతో పెళ్లి ఇలాంటి విషయాలన్ని సినిమాలో ప్రస్థావిస్తారని తెలుస్తుంది. తన ఓన్ ప్రొడక్షన్ లో నిను వీడని నీడని నేను సినిమాతో హిట్ అందుకున్న సందీప్ కిషన్ రీసెంట్ గా వచ్చిన తెనాలి రామకృష్ణ బిఏ,బిఎల్ సినిమాతో మాత్రం ఫ్లాప్ మూటకట్టుకున్నాడు. మరి ఉదయ్ కిరణ్ బయోపిక్ పై వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం ఉందో చూడాలి.