సూపర్ హిట్ డైరక్టర్ తో చైతు..!

అక్కినేని నట వారసుడు నాగ చైతన్య కెరియర్ అటు ఇటుగా ఉన్నా వరుస సినిమాలైతే చేస్తునాడు. జోష్ తో ఎంట్రీ ఇచ్చి ఏమాయచేసావే సినిమాతో హిట్ అందుకున్న నాగ చైతన్య మాస్ ఇమేజ్ కోసం ట్రై చేసి ఫ్లాప్ అయ్యాడు. ఇక తనకు కలిసి వచ్చిన లవర్ బోయ్ ఇమేజ్ ను ఫాలో అవుతున్న చైతు ఈ ఇయర్ ఆల్రెడీ మజిలీతో సూపర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం వెంకీమామ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు చైతు.

ఇక ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత నాగ చైతన్య సూపర్ హిట్ మూవీ గీతా గోవిందం డైరక్టర్ పరశురాం తో సినిమా కన్ఫాం చేశాడు. విజయ్ దేవరకొండ, రష్మిక జంటగా వచ్చిన గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పరశురాం స్టార్ హీరోలతో సినిమాకు ప్రయత్నించినా వర్క్ అవుట్ కాలేదు. అందుకే నాగ చైతన్యతో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్ బ్యానర్ లో రాం ఆచంట, గోపి ఆచంట నిర్మిస్తారని తెలుస్తుంది.