'తలైవి' టీజర్.. జయలలితని మరిపించేలా..!

విజయ్ డైరక్షన్ లో జయలలిత బయోపిక్ గా వస్తున్న సినిమా తలైవి. ఈ సినిమాలో జయలలిత పాత్రలో కంగనా రనౌత్ నటిస్తుంది. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ అయిన కంగనా రనౌత్ తన ప్రతి సినిమాతో ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ ఇస్తుంది. జయలలిత జీవిత కథతో వస్తున్న తలైవిలో ఆమె ఎలా కనిపిస్తుందో అనుకున్నారు. కాని అందరి అంచనాలను మించి తలైవి ఫస్ట్ లుక్ లో సర్ ప్రైజ్ చేసింది కంగనా.  

ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ చూసి మనం చూస్తుంది కంగనానేనా లేక నిజంగా జయలలితే అనేలా ఉంటుంది. జయలలితను మరపించేలా కంగనా ఫస్ట్ లుక్ ఉంది. ఒక సీన్ లో డ్యాన్స్ చేస్తూ.. మరో సీన్ లో పొలిటికల్ మీటింగ్ లో ప్రజలకు అభివాదం చేస్తూ ఇలా రెండు వేరియేషన్స్ లో కంగనా సర్ ప్రైజ్ చేసింది. ఓవిధంగా కంగనా జయలలిత పాత్రకు పర్ఫెక్ట్ ఆప్షన్ అనిపించేలా ఉంది. మరి ఫస్ట్ లుక్ తరహాలోనే సినిమా కూడా ఆడియెన్స్ ను మెప్పిస్తుందా అన్నది సినిమా వస్తేనే చెప్పగలం.