
సూపర్ స్టార్ మహేష్, అనీల్ రావిపుడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాకు సంబందించిన టీజర్ రీసెంట్ గా రిలీజైంది. రిలీజైన కొద్ది గంటల్లోనే ఇది 10 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ ను షేక్ చేసింది. మహేష్ అనీల్ కాంబో పక్కా సూపర్ హిట్ అనేలా ఈ టీజర్ ఉంది. సినిమాలో మహేష్ ఆర్మీ మేజర్ గా కనిపిస్తున్నాడు.
ఆర్మీ మేజర్ గా ఉన్న అజయ్ కృష్ణ కర్నూలులో ఓ ఫ్యామిలీని ఆదుకోడానికి వస్తాడు. ఇంతకీ అసలు అతను రాడానికి గల కారణాలు ఏంటి.. ఆమెకు అతని ఉన్న సంబంధం ఏంటి అన్నది సినిమాలో చూడాల్సిందే. సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది. అంతేకాదు స్పెషల్ రోల్ లో విజయశాంతి సర్ ప్రైజ్ ఇవ్వనుంది. సినిమా టీజర్ చూస్తె అనీల్ డైలాగ్స్ కూడా బాగా పేలేలా ఉన్నాయి. భయపడే వాడే బేరాలాడతాడు.. మన దగ్గర బేరాల్లేవమ్మా.. ప్రతి సంక్రాంతికి అళ్లుల్లొస్తారు.. ఈ సంక్రాంతికి మొగుడొచ్చాడు అంటూ చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి.