
2020 సంక్రాంతికి ఇద్దరు స్టార్స్ బాక్సాఫీస్ దగ్గర పోటీ పడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమాతో వస్తుండగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమాతో దూసుకొస్తున్నాడు. ఈ రెండు సినిమాలు జనవరి 12న రిలీజ్ అని ఎనౌన్స్ చేశారు. అయితే పెద్ద సినిమాలు సంక్రాంతి పండుగ సీజన్ కాబట్టి స్టార్ హీరోల మొదటి రోజు కలక్షన్స్ బాగుంటాయి.
ఇల రెండు ఒకరోజు రిలీజైతే ఫస్ట్ డే కలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడతాయని ఆశించి రెండు సినిమాల దర్శక నిర్మాతలు కూర్చుని చర్చించుకున్నారట. జనవరి 11న మహేష్ సినిమా రిలీజ్ అవుతుండగా ఆ నెక్స్ట్ డే జనవరి 12న బన్ని అల వైకుంఠపురములో వస్తుందట. రెండు సినిమాలు ప్రమోషన్స్ మొదలు పెట్టాయి. మహేష్ అనీల్ కాంబోలో భారీ అంచనాలతో సరిలేరు నీకెవ్వరు వస్తుండగా.. అల్లు అర్జున్, త్రివిక్రం హ్యాట్రిక్ మూవీగా అల వైకుంఠపురములో తెరకెక్కుతుంది. మరి ఒకరోజుతో వచ్చినా ఈ సినిమాల మధ్య పోటీ తప్పదనే చెప్పాలి.