
మెగా ఫ్యామిలీ నుండి రాబోతున్న మరో హీరో వైష్ణవ్ తేజ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఉప్పెన అనే టైటిల్ ప్రచారంలో ఉంది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ చెవిటి, మూగ వానిగా నటిస్తున్నట్టు తెలుస్తుంది. లాస్ట్ ఇయర్ రంగస్థలం సినిమాలో రాం చరణ్ కూడా అలాంటి పాత్రలోనే నటించి మెప్పించాడు.
ఇక ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కూడా మొదటి సినిమాతోనే ప్రయోగం చేస్తున్నాడు. ఈ సినిమా క్లైమాక్స్ కూడా హీరో చనిపోతాడని అంటున్నారు. తెలుగు సినిమాల్లో హీరోలు చనిపోతే సినిమాలు ఆడవన్న బ్యాడ్ సెంటిమెంట్ ఉంది. అయితే ఈమధ్య ప్రేక్షకుల ఆలోచన విధానం కూడా మారింది. సో వైష్ణవ్ తేజ్ తప్పకుండా ఉప్పెన సినిమాతో అలరిస్తాడని అంటున్నారు.