నాగబాబులేని జబర్దస్త్ చూడగలరా..?


ఆరేడేళ్లుగా బుల్లితెర ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేస్తూ వస్తున్న జబర్దస్త్ షో నుండి జడ్జ్ గా వ్యవహరిస్తున్న నాగబాబు ఎగ్జిట్ అవడం సంచలనంగా మారింది. బూతు కామెడీ, రోత కామెడీ అని తిట్టుకున్నా సరే ఎక్కువ శాతం మంది ఆడియెన్స్ అలాంటివి చూస్తున్నారు కాబట్టి ఆ షోకి బాగా క్రేజ్ పెరిగింది. అయితే ఈ శుక్రవారం ఎపిసోడ్ తో నాగబాబుకి జబర్దస్త్ కు ఉన్న బంధం తెగిపోయింది.

ఈ విషయాన్ని మ్మెగా బ్రదర్ నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ లో స్వయంగా వెళ్లడించారు. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల జబర్దస్త్ నుండి బయటకు రావాల్సి వచ్చిందని.. తను ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్న సమయంలో జబర్దస్త్ బాగా హెల్ప్ చేసిందని.. అందుకు శ్యాం ప్రసాద్ రెడ్డి గారికి థ్యాంక్స్ అంటూ ఓ మెసేజ్ పెట్టాడు నాగబాబు. అయితే జబర్దస్త్ డైరక్టర్ నిఖిల్ మల్లెమాల టీం తో గొడవ వల్ల నిఖిల్ బయటకు వెళ్లాడట.

అతనికి వత్తాసు పలకడంతో నాగబాబుకి ఎంత సర్ధి చెప్పినా నిఖిల్ పక్షానే నిలవడంతో మీ ఇష్టం అనేశారు. ఇక ఏముందు మరో భారీ ఆఫర్ రాగానే జబర్దస్త్ ను వదిలేస్తున్నా అనేశారు నాగబాబు. అయితే వేరే ఏ షో అయినా ఇంత కాలం నడవడం కష్టమే. నాగబాబుతో పాటు యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ కు గుడ్ బై చెప్పేసిందని తెలుస్తుంది. సుడిగాలి సుధీర్, చమ్మక్ చంద్ర కూడా ఎగ్జిట్ అవుతున్నారట. మొత్తానికి జబర్దస్త్ లో పెను మార్పులే జరుగనున్నాయని చెప్పొచ్చు.