ఎన్టీఆర్ తో ఆ సినిమా.. ఇష్టం లేకుండానే చేశా..!

రీసెంట్ గా వచ్చిన సైరా నరసింహా రెడ్డితో తన సత్తా చాటిన డైరక్టర్ సురేందర్ రెడ్డి ఓ ఇంటర్వ్యూలో ఎన్.టి.ఆర్ తో తీసిన అశోక్ సినిమా ఇష్టం లేకుండానే చేశానని చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కళ్యాణ్ రాం అతనొక్కడే సినిమాతో దర్శకుడిగా మొదటి సినిమాకే హిట్ అందుకున్న సురేందర్ రెడ్డి రెండో సినిమా ఎన్.టి.ఆర్ తో అశోక్ సినిమా చేశాడు.    

అయితే ఆ సినిమా కేవలం ఎన్.టి.ఆర్ మేనేజర్ వల్లే చేశానని చెప్పాడు సురేందర్ రెడ్డి. ఎన్.టి.ఆర్ మేనేజర్ వచ్చి అశోక్ కథ తనకు ఇచ్చి ఈ సినిమా చేయమని చెప్పారని. తను ఇష్టం లేకపోయినా ఆ సినిమా చేయాల్సి వచ్చిందని అన్నారు సూరి. అసలైతే అశోక్ బదులుగా తను ప్రభాస్ తో సినిమా ప్లాన్ చేశానని చెప్పుకొచ్చారు సురేందర్ రెడ్డి. సైరా తర్వాత ప్రస్తుతం సూరి ప్రభాస్ కోసం ఓ లైన్ సిద్ధం చేసుకున్నాడట. త్వరలోనే ప్రభాస్ ను కలిసి డిస్కస్ చేస్తారట. 

సురేందర్ రెడ్డి అశోక్ సినిమాపై చేసిన కామెంట్స్ తో నందమూరి ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. అశోక్ సినిమా తర్వాత మళ్లీ సురేందర్ రెడ్డికి ఎన్.టి.ఆర్ ఊసరవెల్లి ఛాన్స్ ఇచ్చాడు. అలాంటి ఎన్.టి.ఆర్ మేనేజర్ గురించి రాంగ్ కామెంట్స్ చేస్తావా అని నందమూరి ఫ్యాన్స్ ట్రోల్స్ మొదలు పెట్టారు.