జార్జి రెడ్డి గురించి చిరంజీవి ఏమన్నారంటే..!

విద్యార్ధి నాయకుడు జార్జి రెడ్డి జీవిత కథతో అదే టైటిల్ తో ఓ సినిమా వస్తున్న విషయం తెలిసిందే. దళం ఫేం జీవన్ రెడ్డి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. వంగవీటి సినిమాలో వంగవీటి రంగా పాత్రలో నటించిన సందీప్ ఈ సినిమాలో జార్జి రెడ్డిగా నటించాడు. ఈనెల 29న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ బాగా చేస్తున్నారు. ఇప్పటికే పవన్ ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు వస్తారని హడావిడి చేసిన చిత్రయూనిట్ లాస్ట్ మినిట్ లో ఆ ఈవెంట్ క్యాన్సిల్ చేసింది.

ఇక లేటెస్ట్ గా సినిమాలోని అడుగు.. అడుగు సాంగ్ ను మెగాస్టార్ చిరంజీవితో రిలీజ్ చేయించారు. తాను 1972 ఒంగోలులో ఇంటర్ చదువుతున్న టైంలో జార్జి రెడ్డి గురించి మొదటిసారి విన్నానని.. మళ్లీ ఇన్నాళ్లకు ఈ సినిమా ద్వారా అతని పేరు విన్నానని.. ఈ సాంగ్ చూస్తుంటే విద్యార్ధి నాయకుడిగా సమస్యల మీద ఆయన ఎలా స్పందించారో అర్ధమవుతుంది.          

జార్జి రెడ్డి లాంటి సినిమాలు నేటి యువతకు బాగా కనెక్ట్ అవుతాయని సినిమాకు పనిచేసిన వారందరికి ప్రత్యేక అభినందనలు తెలియచేశారు.. ఈ సినిమా కోసం తాను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని అన్నారు మెగాస్టార్ చిరంజీవి.