తమిళ దర్శకుడితో అఖిల్..?

అక్కినేని యువ హీరో అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరక్షన్ లో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్ని వాసు ఈ సినిమా నిర్ముస్తుండగా క్రేజీ హీరోయిన్ పూజా హెగ్దె అఖిల్ తో రొమాన్స్ చేస్తుంది. లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా పూర్తవ్వకముందే తన తర్వాత సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు అఖిల్.

తెలుస్తున్న సమాచారం ప్రకారం అఖిల్ తమిళ దర్శకుడితో తన 5వ సినిమా చేస్తాడని అంటున్నారు. కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరక్టర్ పి.ఎస్.మిత్రన్ అఖిల్ కు ఓ కథ చెప్పాడట. కథ నచ్చడంతో అఖిల్ కూడా దాదాపుగా ఓకే అన్నట్టు తెలుస్తుంది. విశాల్ తో ఇరుంబు థిరై సినిమాతో హిట్ అందుకున్న మిత్రన్ ప్రస్తుతం శివ కార్తికేయన్ తో హీరో సినిమా చేస్తున్నాడు.   

హీరో హిట్ అయితే మాత్రం మిత్రన్ డైరక్షన్ లో అఖిల్ సినిమా కన్ ఫాం అయినట్టే. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాతో అఖిల్ కూడా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈ సినిమా 2020 సమ్మర్ లో రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.