లారీ డ్రైవర్ గా బన్ని

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అల వైకుంఠపురములో 2020 సంక్రనతికి రిలీజ్ ప్లానింగ్ లో ఉన్న ఈ సినిమా తర్వాత బన్ని సుకుమార్ కాంబో మూవీ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమా నుండి స్పెషల్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది. ఇప్పటికే సినిమా ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ కథతో వస్తుందని తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా కనిపిస్తాడట. తన కెరియర్ లో ఇప్పటికే ఎన్నో విభిన్న పాత్రలు చేసిన బన్ని సుకుమార్ సినిమాలో మరోకొత్త రోల్ లో కనిపించనున్నాడు. రంగస్థలంతో రాం చరణ్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ ఇచ్చిన సుకుమార్ బన్నికి దాన్నిమించిన హిట్ ఇవ్వాలని తాపత్రయపడుతున్నాడు. ఇప్పటికే అల వైకుంఠపురములో సినిమాలో అల్లు అర్జున్ మాస్ లుక్ తో కనిపిస్తున్నాడు. మరి సుకుమార్ సినిమాలో స్టైలిష్ స్టార్ ఎలా సర్ ప్రైజ్ చేస్తాడో చూడాలి.