
మెగా డాటర్ నిహారిక కెరియర్ పరంగా ఓ ఫైనల్ డెశిషన్ కు వచ్చినట్టు తెలుస్తుంది. మెగా ఫ్యామిలీ నుండి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి అందరికి షాక్ ఇచ్చిన నిహారిక ఒకమనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాలు చేసింది. 3 సినిమాలు ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చినా కమర్షియల్ గా మాత్రం వర్క్ అవుట్ అవలేదు. అందుకే నిహారిక మళ్లీ తనకు క్రేజ్ వచ్చిన వెబ్ సీరీస్ ల మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది.
ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ సూపర్ హిట్ అవగా.. ఆ తర్వాత నాన్నకూచి అనే వెబ్ సీరీస్ చేసింది నిహారిక. లేటెస్ట్ గా మ్యాడ్ హౌజ్ అని మరో వెబ్ సీరీస్ ను మొదలుపెట్టింది. ఈ వెబ్ సీరీస్ 100 ఎపిసోడ్స్ తో వస్తుందని తెలుస్తుంది. రీసెంట్ గా మొదలైన ఈ వెబ్ సీరీస్ మొదటి ఎపిసోడ్ లో నిహారిక కనిపించలేదు. మరి నిహారిక 100 ఎపిసోడ్ ల మ్యాడ్ హౌజ్ వెబ్ సీరీస్ తో అయినా హిట్టు కొడుతుందేమో చూడాలి.