
దర్శకధీరుడు రాజమౌళి ఓ సినిమాకు సపోర్ట్ ఇస్తున్నాడు అంటే అందులో కచ్చితంగా మ్యాటర్ ఉన్నట్టే లెక్క. కాన్సెప్ట్ బేస్డ్ మూవీగా వస్తున్న సినిమా మత్తు వదలరా. రితేష్ రానా డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో హీరోగా కీరవాణి తనయుడు సింహా కోడూరి నటిస్తున్నాడు. ఈ మూవీకి మ్యూజిక్ కూడా కీరవాణి మరో తనయుడు కాల భైరవ అందిస్తున్నాడు. ఫస్ట్ కాపీ సిద్ధమైన ఈ సినిమా రాజమౌళికి చూపించారట.
ఈ సినిమా చూసిన జక్కన్న కొన్ని మార్పులు సూచించాడని తెలుస్తుంది. జక్కన్న సలహాల మేరకు చిత్రయూనిట్ చేస్తుందట. కాన్సెప్ట్ మూవీ కాబట్టి కచ్చితంగా ప్రేక్షకులను రీచ్ అయితే పక్కాగా మెప్పిస్తుందని అంటున్నారు. అయితే ఈ సినిమా ప్రమోషన్స్ కూడా భారీగా చేసేలా ఉన్నారు. హేమలత నిర్మించిన ఈ సినిమాను రితేష్ రానా డైరెక్ట్ చేస్తున్నారు. డిసెంబర్ 25న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.