
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం సతీష్ వేగేశ్న డైరక్షన్ లో ఎంత మంచివాడవురా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మెహ్రీన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా తర్వాత ఈ నందమూరి హీరో టైం మిషన్ బ్యాక్ డ్రాప్ కథతో సినిమా చేస్తున్నాడట. నందమూరి బాలకృష్ణ నటించిన ఆదిత్య 369 సినిమా కూడా టైం మిషన్ నేపథ్యంతో తెరకెక్కింది.
ఇప్పుడు కళ్యాణ్ రాం కూడా అదే తరహా కథతో ఓ సినిమా చేస్తున్నాడట. వేణు మల్లిడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తారని తెలుస్తుంది. ఈ సినిమాను ఎవరు నిర్మిస్తున్నారు.. ఇందులో మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది ఇంకా తెలియలేదు. కళ్యాణ్ రాం ఎంత మంచివాడవురా సినిమా మాత్రం 2020 సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. జనవరి 15న ఈ సినిమా రిలీజ్ అవుతుంది.