రాములో రాములా మిస్సైందా..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజా హెగ్దె జంటగా మాటల మాంత్రికుడు త్రివిక్రం డైరక్షన్ లో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలోని రెండు సాంగ్స్ రిలీజై ఇప్పటికే సెన్సేషనల్ హిట్ అయ్యాయి. సామజవరగమన సాంగ్ తో పాటుగా రాములో రాములా సాంగ్ కూడా శ్రోతలను అలరిస్తుంది. సామజవరగమన సాంగ్ సిద్ శ్రీరాం పాడగా రాములో రాములా సాంగ్ అనురాగ్ కులకర్ణి ఆలపించడం జరిగింది.

అయితే ఈ మాస్ బీట్ ను బిగ్ బాస్ విన్నర్ రాహుల్ చేత పాడించాలని అనుకున్నారట. బిగ్ బాస్ వెళ్లడానికి ముందు రాములో రాములా సాంగ్ రాహుల్ తో పాడించడానికి ప్రయత్నాలు చేశారట. రాహుల్ కూడా పాడేందుకు ఓకే చెప్పాడట. కాని ఇంతలోనే అతను బిగ్ బాస్ కు వెళ్లడం 105 రోజులు హౌజ్ లో ఉండటం వల్ల సాంగ్ సిద్ధం చేయాల్సి ఉందని తమన్ అనురాగ్ కులకర్ణి తో పాడించాడు. ఇదే పాట రాహుల్ పాడితే మాత్రం మరోలా ఉండేదని అంటున్నారు సంగీత ప్రియులు.