
కోలీవుడ్ స్టార్ హీరో కార్తి తమిళంతో పాటుగా తెలుగులో కూడా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. ఈమధ్య కాలంలో తెలుగులో సూపర్ హిట్ అందుకున్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది కార్తి అనే చెప్పాలి. రీసెంట్ గా అతను నటించిన ఖైది సినిమా తెలుగు, తమిళ భాషల్లో సూపర్ హిట్ అయ్యింది. లోకేష్ కనగరాజ్ డైరక్షన్ లో వచ్చిన ఖైది సినిమా కార్తి కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ నిలిచింది.
ఇక ఈ సినిమా తర్వాత కార్తి తన వదిన జ్యోతికతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. తమిళంలో జాక్ పాట్ పేరుతో వస్తున్న ఈ సినిమాను కూడా తెలుగులో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. తెలుగులో ఈ సినిమాకు తమ్ముడు అని టైటిల్ ఫిక్స్ చేశారు. రీసెంట్ గా ఖైదితో హిట్ అందుకున్న కార్తి మరోసారి మెగా టైటిల్ నే వాడేస్తున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరియర్ లో క్రేజీ హిట్ గా నిలిచిన తమ్ముడు టైటిల్ తో వస్తున్న కార్తి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.