
నందమూరి బాలకృష్ణ ఎన్.టి.ఆర్ బయోపిక్ గా ఎన్.టి.ఆర్ కథానాయకుడు, ఎన్.టి.ఆర్ మహానాయకుడు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. రెండు సినిమాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేదు. ఎన్.టి.ఆర్ బయోపిక్ తర్వాత బాలకృష్ణ రూలర్ సినిమా చేస్తున్నాడు. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. డిసెంబర్ 20న ఈ సినిమా రిలీజ్ కానుంది.
ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య బాబు బోయపాటి శ్రీను డైరక్షన్ లో సినిమా చేస్తాడని తెలుస్తుంది. సింహా, లెజెండ్ సినిమాలతో వీళ్లిద్దరిది హిట్ కాంబినేషన్ కాగా ముచ్చటగా మూడవసారి ఇద్దరు కలిసి సినిమా చేస్తున్నారు. అయితే ఎన్.టి.ఆర్ బయోపిక్ సినిమా నిరాశపరచినా ఎన్.టి.ఆర్ పాత్ర మాత్రం బాలకృష్ణను వీడి వెళ్లట్లేదు. అదెలా అంటే ప్రస్తుతం కోలీవుడ్ లో జయలలిత బయోపిక్ సినిమా తెరకెక్కుతుంది.
విజయ్ డైరక్షన్ లో వస్తున్న తెరకెక్కుతున్న జయలలిత బయోపిక్ కు తళైవి అనే టైటిల్ ఫిక్స్ చేశారు. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కంగనా రనౌత్ ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటిస్తుంది. జయలలిత బయోపిక్ లో ఎన్.టి.ఆర్ పాత్ర కూడా ఉంటుందట. ఆ పాత్రలో మరోసారి బాలకృష్ణ ఎన్.టి.ఆర్ రోల్ లో కనిపిస్తాడని తెలుస్తుంది.