
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేషనల్ వైడ్ క్రేజ్ తెచ్చుకున్నాడు.. బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో సినిమా కూడా ప్రభాస్ కు బాలీవుడ్ లో మంచి హిట్ గా నిలిచింది. ప్రస్తుతం జిల్ ఫేమ్ రాధాకృష్ణతో జాన్ సినిమా చేస్తున్న ప్రభాస్ ఆ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి డైరక్షన్ లో సినిమా చేయాల్సి ఉంది. అయితే ప్రభాస్ కథ విని నో చెప్పాడో ఏమో కాని అదే కథతో సురేందర్ రెడ్డి వరుణ్ తేజ్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది.
ప్రభాస్ కోసం సిద్ధం చేసిన కథను వరుణ్ తేజ్ కు వినిపించాడట సురేందర్ రెడ్డి. వరుణ్ తేజ్ కు అది బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఈ ఇయర్ ఎఫ్-2, గద్దలకొండ గణేష్ సినిమాలతో హిట్ అందుకున్న వరుణ్ తేజ్ ప్రస్తుతం కిరణ్ కొర్రపాటి డైరక్షన్ లో బాక్సర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డి సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది.