
సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న సమంత అక్కినేని కోడలిగా మారిన తర్వాత కూడా వరుస సినిమాలు చేస్తుంది. పెళ్లి తర్వాత హీరోయిన్స్ కు డిమాండ్ ఉంటుందని సమంతను చూసి చెప్పొచ్చు. ఈ ఇయర్ మజిలీ, ఓ బేబీ సినిమాలతో సక్సెస్ అందుకున్న సమంత ప్రస్తుతం 96 తెలుగు రీమేక్ లో నటిస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాతో పాటుగా అమేజాన్ ప్రైం వెబ్ సీఎరీస్ ఫ్యామిలీ మ్యాన్ లో కూడా సమంత నటిస్తుంది.
ఈమధ్య సినిమాలకు బ్రేక్ ఇస్తున్న వార్తలు వినిపిస్తుండగా తన దగ్గరకు వచ్చే దర్శకులకు కథ విషయంలో చాలా క్లియర్ కట్ గా ఉండాలని చెబుతుందట సమంత. అంతేకాదు స్టార్ సినిమాలకు ఆమె నో చెబుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రయోగాత్మక సినిమాలకు ఓకే చెబుతున్నట్టుగా తెలుస్తుంది. స్టార్ సినిమాల్లో కూడా తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే సినిమా చేస్తానని చెబుతుందట. మరి సమంత తీసుకున్న ఈ నిర్ణయం కెరియర్ మీద ఎలాంటి ఎఫెక్ట్ చూపుతుందో చూడాలి.