జోడీ అదరగొడుతుందట..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా అల వైకుంఠపురములో. ఈ సినిమాలో బన్ని సరసన పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఈ ఇద్దరు దువ్వాడ జగన్నాథం సినిమాలో కలిసి నటించారు. ఇప్పుడు ఈ సినిమాలో ఈ జోడీ అలరించనుంది. సినిమాలో ఈ ఇద్దరి జంట స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తుందని అంటున్నారు.    

బన్ని డిజే సినిమాతో హిట్ అందుకుని అప్పటి నుండి స్టార్ క్రేజ్ తెచ్చుకున్న పూజా హెగ్దె మరోసారి బన్నితో అల వైకుంఠపురములో సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటుగా ప్రభాస్ జాన్ సినిమాలో కూడా పూజా ఛాన్స్ కొట్టేసింది. కొన్ని హిట్ పెయిర్స్ ఎన్నిసార్లు జతకట్టినా చూసేయొచ్చు.. అలానే అల్లు అర్జున్, పూజా హెగ్దె జంట మరోసారి ఈ సినిమాతో అలరిస్తారట. ఈ సినిమా కూడా హిట్టైతే ఈ జోడీకి మరింత డిమాండ్ పెరిగినట్టే.