వాల్ట్ డిస్నీ ఫ్రోజెన్ 2 కోసం సితార వాయిస్..!

వాల్ట్ డిస్నీ స్టూడియోస్ నిర్మించిన ఫ్రోజెన్ 2 ఈ నెల 22న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది. 2013లో వచ్చిన ఫ్రోజెన్ సినిమాకు ఈ మూవీ సీక్వల్ గా వస్తుంది. ఈ సినిమాలో ఎల్సా చిన్నప్పటి పాత్రకు సూపర్ స్టార్ మహేష్ డాటర్ సితార డబ్బింగ్ చెబుతుంది. రాకుమార్తె ఎల్సా పెద్దయ్యాక ఆ పాత్రకు నిత్యా మీనన్ డబ్బింగ్ చెబుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమ నుండి సితార చిన్నప్పటి ఎల్సా పాత్రకు డబ్బింగ్ చెబుతుంది అంటూ వాల్ట్ డిస్నీ స్టూడియోస్ ఇండియా అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ చేసింది. 

మహేష్ గారాల పట్టి అప్పుడే హాలీవుడ్ ఛాన్స్ పట్టేసిందన్నమాట. అయితే సితార కేవలం తెర వెనుక మాత్రమే పనిచేస్తుంది. సితార వాయిస్ తెలుగులో ఫ్రోజెన్ 2కు స్పెషల్ ఎట్రాక్షన్ అవుతుందని అంటున్నారు. ఇక ఇటీవల వస్తున్న హాలీవుడ్ యానిమేషన్ సినిమాలకు తెలుగు స్టార్స్ డబ్బింగ్ ఇస్తున్నారు. అల్లాదిన్ సినిమాకు వరుణ్, వెంకటేష్ డబ్బింగ్ చెప్పగా.. ది లయన్ కింగ్ సినిమాకు నాని డబ్బింగ్ చెప్పాడు.