విజయ్ దేవరకొండ సరికొత్త ప్లాన్..!

ఐదు సినిమాలతోనే సౌత్ లో స్టార్ క్రేజ్ తెచ్చుకున్నాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా చేస్తున్న విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాల మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. తన దగ్గరకు వస్తున్న దర్శకులకు సినిమా కథ యూనివర్సల్ గా వర్క్ అవుట్ అయ్యేలా ఉండాలని చెబుతున్నాడట. డియర్ కామ్రేడ్ ఒక్క హిందిలో తప్ప సౌత్ అన్ని భాషల్లో రిలీజైంది.

సినిమా ఫలితం ఎలా ఉన్నా విజయ్ దేవరకొండ క్రేజ్ ఏంటో అందరికి తెలిసింది. అందుకే ఈసారి కొడితే గట్టిగా కొట్టాలన కసి మీద ఉన్నాడు విజయ్ దేవరకొండ. వరల్డ్ ఫేమస్ లవర్ తర్వాత పూరి జగన్నాథ్ తో సినిమా ఓకే అయ్యింది. ఆ సినిమానే పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేస్తారని అంటున్నారు. మరి విజయ్ దేవరకొండ సరికొత్త ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.