కోకో కోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ..!

నందమూరి బాలకృష్ణ వయసు పెరుగుతున్నా కొద్దీ వన్నె తగ్గడం లేదని చెప్పాలి. అంతేకాదు 100 సినిమాలు పూర్తి చేసిన దగ్గర నుండి సినిమాల వేగం పెంచేశాడు బాలయ్య బాబు. ఎన్.టి.ఆర్ బయోపిక్ నిరాశ పరచగా కొద్దిపాటి గ్యాప్ తో రూలర్ గా రాబోతున్నాడు బాలకృష్ణ. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. సి.కె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సి కళ్యాణ్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 

ఈ సినిమాకు సంబందించిన మరో పోస్టర్ ఈరోజు రిలీజ్ చేశారు చిత్రయూనిట్. బాలయ్య బాబు స్టైలిష్ లుక్ లో యువ హీరోల మాదిరిగా ఉన్నాడు. ఈ లుక్ చూస్తుంటే బాలకృష్ణ కోసం ఫ్యాన్స్ పాడుకునే ఓ పాట గుర్తుకొస్తుంది. అదేంటి అంటే కోకో కోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ అనుకోక తప్పదు. పైసా వసూల్ సినిమా ప్రమోషనల్ సాంగ్ కోసం ఇది వాడేశారు. రూలర్ నుండి వచ్చిన ఈ లేటెస్ట్ లుక్ చూస్తే మరోసారి నందమూరి ఫ్యాన్స్  కోకో కోలా పెప్సీ.. బాలయ్య బాబు సెక్సీ అనకుండా ఉండలేరు. డిసెంబర్ 20న రూలర్ సినిమా రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్నారు.