
సూపర్ స్టార్ రజినికాంత్ హీరోగా ఏ.ఆర్. మురుగదాస్ డైరక్షన్ లో వస్తున్న సినిమా దర్బార్. లైకా ప్రొడక్షన్స్ లో శుభాస్కరన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో రజినికాంత్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తాడని తెలుస్తుంది. ఈ మూవీలో నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా నివేదా థామస్ కూడా స్పెషల్ రోల్ లో నటిస్తుంది.
ఈ సినిమాకు రజినికాంత్ 100 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నారని కోలీవుడ్ టాక్. సౌత్ లో ఈ రేంజ్ లో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న మరో నటుడు లేరని చెప్పొచ్చు. సౌత్ లోనే కాదు ఇండియాలోనే 100 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న సూపర్ స్టార్ రజినికాంత్ అని తెలుస్తుంది. 2020 జనవరి 9న దర్బార్ తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది. ఈమధ్య రిలీజైన ఈ సినిమా మోషన్ పోస్టర్ లో రజిని లుక్ అదిరిపోయింది. మరి సినిమా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాలి.