ఇస్మార్ట్ బ్యూటీకి అదిరిపోయే ఛాన్స్..!

సవ్యసాచి, మిస్టర్ మజ్ను సినిమాల్లో హీరోయిన్ గా నటించిన నిధి అగర్వాల్ పూరి, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ హిట్ తో సూపర్ క్రేజ్ ఎచ్చుకుంది. ఆ సినిమాలో నిధి, నభా నటేష్ ల అందాల ప్రదర్శనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారని చెప్పొచ్చు. ఈ సినిమా తర్వాత ఇస్మార్ట్ హీరోయిన్స్ ఇద్దరికి గిరాకి పెరిగింది. ఇప్పటికే నభా నటేష్ చేతినిండా సినిమాలతో బిజీ అవగా.. నిధి అగర్వాల్ కూడా వరుస ఆఫర్లతో దూసుకెళ్తుంది.  

సూపర్ స్టార్ మహేష్ మేనళ్లుడు గల్ల అశోక్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. గల్లా జయదేవ్ తనయుడైన గల్లా అశోక్ మొదటి సినిమాలో హీరోయిన్ గా నిధి అగర్వాల్ లక్కీ ఛాన్స్ అందుకుంది. ఈ మూవీని శ్రీరాం ఆదిత్య డైరెక్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో నటించేందుకు గాను నిధి అగర్వాల్ ఏకంగా కోటి పాతిక లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటుందట. ఇస్మార్ట్ బ్యూటీకి ఓ రకంగా ఇది అదిరిపోయే ఛాన్స్ అని చెప్పొచ్చు. కొత్త హీరో అయినా సూపర్ స్టార్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి కచ్చితంగా నిధి అగర్వాల్ కు ఈ సినిమా తర్వాత మరింత పాపులారిటీ వచ్చే అవకాశం ఉంటుంది.