మమ్ముట్టి 'మామాంగం' ట్రైలర్ రిలీజ్..!

బాహుబలి సినిమా సూపర్ సక్సెస్ అవడంతో పిరియాడికల్ మూవీస్ కు మంచి డిమాండ్ పెరిగింది. తెలుగు, తమిళ భాషల్లోనే కాదు కన్నడ, మళయాళ భాషల్లో అలాంటి సినిమాలకు క్రేజ్ పెరిగింది. లేటెస్ట్ గా మళయాళంలో 250 ఏళ్ల నాటి చారిత్రక కథతో ఓ సినిమా వస్తుంది. అదే మామాంగం. మళయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను ఎం.పద్మ కుమార్ డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాకు కావ్య ఫిలింస్ బ్యానర్ లో వేణు కున్నపిల్లి నిర్మిస్తున్నారు.      

ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ రిలీజైంది. మళయాళంలో తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు, హింది, తమిళ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకు ట్రైలర్ చూస్తే తప్పకుండా బాహుబలి రేంజ్ సినిమా అయ్యేలా ఉందని చెప్పొచ్చు. మమ్ముట్టి నటన, డైరక్టర్ టేకింగ్, వి.ఎఫ్.ఎక్స్ అన్ని సినిమాలో హైలెట్ గా ఉన్నాయి. నవంబర్ 21న రిలీజ్ అవుతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.