
మెగాస్టార్ చిరంజీవి 152వ సినిమా కొరటాల శివ డైరక్షన్ లో వస్తుంది. ఈమధ్యనే ముహుర్త కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష సెలెక్ట్ అయినట్టు తెలుస్తుంది. కొరటాల శివ అన్ని సినిమాల్లానే ఇది కూడా సోషల్ మెసేజ్ తో వస్తుందట. ఇంకా సెట్స్ మీదకు వెళ్లని ఈ సినిమాకు మొన్నటివరకు గోవింద ఆచార్య అనే టైటిల్ పెడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి.
మెగా ఫ్యాన్స్ ఆ టైటిల్ తో ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమాకు మరో టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ సినిమా గోవిందా హరి గోవిందా అని పెట్టబోతున్నారట. సినిమాలో చిరు డ్యుయల్ రోల్ లో నటిస్తున్నాడని తెలుస్తుంది. 2020 సమ్మర్ లో ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. సైరా సక్సెస్ జోష్ లో ఉన్న చిరు ఈ సినిమాతో ఎలాంటి హిట్ అదుకుంటాడో చూడాలి.