మహేష్.. బన్ని.. ఒక్కరోజు తేడాతో..!

సూపర్ స్టార్ మహేష్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇద్దరు తమ సినిమాలతో ఒకేరోజు పోటీకి వస్తున్నారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు సినిమా.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా రెండు సినిమాలు 2020 సంక్రాంతికి జనవరి 12న రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాయి. అయితే సంక్రాంతి సినిమాలకు ముందు ఇలానే జరుగుతుంది తీరా రిలీజ్ టైం దగ్గర పడితే మాత్రం ఎవరో ఒకరు కన్విన్స్ అయ్యి సినిమాల రిలీజ్ డేట్లు మార్చుకుంటారు.

దిల్ రాజు నిర్మిస్తున్న సరిలేరు నీకెవ్వరు.. హారిక హాసిని, గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న అల వైకుంఠపురములో నిర్మాతల మధ్య ఓ మీటింగ్ జరిగిందట. సినిమాల రిలీజ్ డేట్ల విషయంలోనే ఈ మీటింగ్ జరిగిందని టాక్. జనవరి 11న మహేష్ సరిలేరు నీకెవ్వరు.. ఒకరోజు గ్యాప్ ఇచ్చి అనగా 13న అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా రిలీజ్ అయ్యేలా ఫిక్స్ చేశారట. స్టార్ సినిమాలకు కనీసం ఒక్కరోజు కూడా గ్యాప్ లేకపోతే అది కలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే మహేష్ బన్ని సినిమాల రిలీజ్ డేట్లు మార్చుతారని తెలుస్తుంది.