
టాలీవుడ్ క్రేజీ డైరక్టర్ సుకుమార్ రంగస్థలంతో ఓ రెస్పెక్ట్ కూడా తెచ్చుకున్నాడు. సుకుమార్ హిట్టు కొడితే ఆ సినిమా ఎలా ఉంటుందో చెప్పేందుకు రంగస్థలం ఓ ల్యాండ్ మార్క్ అయ్యింది. ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్న సుకుమార్ ఈ సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవితో మళయాళ సినిమా రీమేక్ చేస్తాడని వార్తలు వచ్చాయి. మళయాళంలో మోహన్ లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ లూసిఫర్ రీమేక్ లో చిరు నటిస్తాడని.. ఆ సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ సుక్కు అందుకున్నాడని అన్నారు.
అయితే లూసిఫర్ రీమేక్ రైట్స్ రాం చరణ్ కొన్న విషయం నిజమే కాని సుకుమార్ డైరెక్ట్ చేయడం మాత్రం కష్టమే అన్నాడట. ఇప్పటివరకు రీమేక్ సినిమాలు చేయని సుకుమార్ లూసిఫర్ ను డైరెక్ట్ చేయాలన్న చరణ్ ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించాడట. కావాలంటే తను వేరే కథ సిద్ధం చేస్తానని చెప్పాడట. అయితే సుకుమార్ తో ఆ రీమేక్ చేయించాలని అనుకున్న చరణ్ కు నిరాశ మిగిలింది. మరి ఆ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తారో చూడాలి.