
గురువారం పుట్టినరోజు జరుపుకున్న కమల్ హాసన్ తన ఫ్యాన్స్ అండ్ ఫాలోవర్స్ కోసం స్పెషల్ పిక్స్ షేర్ చేసుకున్నాడు. అయితే ఈ పిక్స్ లో కేవలం కమల్ హాసన్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉండగా ఒక హీరోయిన్ మాత్రం వారితో ఫోటోలో ఉంది.. కమల్ హాసన్ ఫ్యామిలీ ఫోటోలో ఉన్న హీరోయిన్ ఎవరు అంటే విశ్వరూపం 1, 2లో నటించిన పూజా కుమార్.
కమల్ తన బర్త్ డేని తన ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకున్నారు. కమల్ సోదరుడు చారు హాసన్ అండ్ ఫ్యామిలీ కూడా ఈ సెలబ్రేషన్స్ లో ఉన్నారు. శృతి హాసన్, అక్సరా హాసన్ తో పాటుగా పూజా కుమార్ కూడా ఈ పిక్ లో ఉంది. మరి కమల్ కేవలం పూజా కుమార్ కు మాత్రమే ఇన్విటేషన్ అందించాడా లేక ఆమే కావాలని కమల్ ను విష్ చేయడానికి వచ్చిందా అన్నది తెలియాల్సి ఉంది.
గౌతమితో విడిపోయాక కమల్ ఇప్పుడు ఒంటరిగానే ఉంటున్నాడు. విశ్వరూపంలో పూజా కుమార్ తో కలిసి నటించాడు కమల్. ఒకవేళ కమల్ కు ఆమెకు మధ్యలో ఏదైనా సంథింగ్ సంథింగ్ ఉందా అంటూ సోషల్ మీడియాలో డిస్కషన్ స్టార్ట్ అయ్యింది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.