
క్రేజీ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కెరియర్ లో మరింత బిజీగా మారింది. ఈ ఇయర్ ఆల్రెడీ మజిలీ, ఓ బేబీ సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న సమంత ప్రస్తుతం 96 తెలుగు రీమేక్ లో నటిస్తుంది. దీనితో పాటుగా అమేజాన్ ప్రైం నిర్మిస్తున్న ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ లో కూడా ఛాన్స్ దక్కించుకుంది సమంత. పెళ్లై రెండేళ్లు అవుతుండగా సమంతకు పిల్లల మీద ద్యాస మళ్లినట్టు తెలుస్తుంది.
ప్రస్తుతం కమిటైన సినిమాలను పూర్తి చేసి లాంగ్ గ్యాప్ ఇవ్వాలని చూస్తుందట. అంతేకాదు తల్లి అయ్యేందుకు తీసుకోవాల్సిన ఆరోగ్య సూత్రాలను కూడా పాటిస్తుందని తెలుస్తుంది. పిల్లలంటే చాలా ఇష్టపడే సమంత పిల్లల కోసం ఆరాటపడుతుంది. నాగ చైతన్య ప్రస్తుతం వెంకీమామ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటుగా శేఖర్ కమ్ముల డైరక్షన్ లో వస్తున్న లవ్ స్టోరీ మూవీ కూడా సెట్స్ మీదకు తీసుకెళ్లాడు.